Asianet News TeluguAsianet News Telugu

మీరు మారితే మంచిది... మేము మార్చాల్సి వస్తే కఠినచర్యలే:  అడిషనల్ డిజిపి స్వాతి లాక్రా

కౌన్సెలింగ్ లో పాల్గొన్న మహిళా భద్రత విభాగం డిఐజి శ్రీమతి సుమతి మాట్లాడుతూమహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా వారిని ప్రేరేపించటంతో పాటు పిల్లల ధోరణిని వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులను కోరారు.

Swathi Lakhra suggests to change attitude
Author
Hyderabad, First Published Nov 5, 2020, 7:57 PM IST

తెలంగాణ మహిళా భద్రత విభాగం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను వేధించిన, సోషల్ మీడియా వేదికలపై మహిళలపై అనుచిత వాఖ్యలు చేయటమో, ఇతర మార్గాలలో యువతులను వేధించటమో చేసిన  మందికి పైగా 150 మందికి  పైగా  బాధ్యులను ఇందులో 143 మంది మేజర్లు కాగా, 7 మంది మైనర్లను రాష్ట్ర షీ టీమ్స్ గుర్తించి వారికి రాష్ట్ర మహిళా భద్రత విభాగం ప్రధాన కార్యాలయం నుండి ఆన్ లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే తప్పిదాలు చేసిన బాధ్యుల్లో మార్పు తీసుకురావటానికి అవలంభించే విధానమే ఈ ఆన్ లైన్ కౌన్సెలింగ్.  

ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అడిషనల్ డిజిపి శ్రీమతి స్వాతి లక్రా మాట్లాడుతూ మహిళలను వేధించిన బాధ్యుల్లో మైనర్లు కూడా ఉన్నారని వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యేలా అన్ని జిల్లా షీ టీమ్స్ శ్రద్ద తీసుకున్నాయని అన్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల ముందు ఆ యువకుల ప్రవర్తనను మార్చటానికి దోహదం చేసినవారం అవుతామని చెప్పారు. మళ్ళి ఇంకొకసారి అదే పొరపాటు గనుక పునరావృతం చేసినట్టు అవుతే మా దగ్గర ఉన్న డేటా బేస్ ప్రకారం వారిపై కఠినచర్యలు తీసుకొని నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ఈ కఠిన చర్యలు తీసుకునే అవకాశం బాధ్యులు ఇవ్వకూడదని ఈ మోడల్ కౌన్సెలింగ్ ప్రధాన ఉద్దేశ్యం బాధ్యుల్లో మార్పు దిశగా ఆలోచింపజేయటమే నని పునరుద్ఘాటించారు. వాళ్లలో ఈ మార్పు కోసమే ప్రయోగాత్మక కౌన్సెలింగ్ విధానాన్ని చేపట్టామని తెలిపారు. 

ఇట్టి కౌన్సెలింగ్ లో పాల్గొన్న మహిళా భద్రత విభాగం డిఐజి శ్రీమతి సుమతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యులను గుర్తించి ఇటువంటి మోడల్ కౌన్సెలింగ్ విధానం చెప్పట్టడానికి ప్రధాన కారణం వారిలో మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా వారిని ప్రేరేపించటంతో పాటు పిల్లల ధోరణిని వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమం మొదట్లో వనపర్తి జిల్లాకు చెందిన 9 వ తరగతి చదువుతున్న చిట్టెమ్మ అనే బాలిక షీ టీమ్స్ ప్రాముఖ్యత గురించి రాష్ట్రంలో మహిళల పట్ల షీ టీమ్ తీఎసుకుంటున్న రక్షణ చర్యల గురించి చక్కగా చెప్పింది. షీ టీమ్స్ విధి విధానాల గురించి వాటిని మహిళలు ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పారు. 

అలాగే ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్ల పాల్గొని బాధ్యులతో కొన్ని సైకాలజీ పరమైన విధానాలను అవలంభిస్తూ వారి తప్పును తెలుసుకొని వారిలో మార్పు వచ్చేలా చేయటానికి తన సిబ్బందితో కలిసి వివిధ రకాల పద్దతులను అవలంభింపజేశారు. దీని వల్ల ఆ బాధ్యులైన యువకులు పరివర్తన దిశగా వాళ్లలో స్పష్టమైన మార్పు కనిపించిందని డాక్టర్ గీత చెప్పారు. కొందరు యువకులు తాము చేసిన తప్పుల పట్ల పశ్చాతాపం చెందారు. ఇందులో కొంత మంది వ్యక్తులు తమలో మార్పు వచ్చిందని తమ తమ జిల్లా షీ టీమ్ లు తమ పరివర్తన దిశగా ఎంతో ప్రయత్నం చేశాయని ఇక మీదట ఇలాంటి తప్పిదాలకు పాల్పడబోమని చెప్పటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios