Asianet News TeluguAsianet News Telugu

మిస్టరీగానే చంపాపేట్ స్వప్న హత్య కేసు.. చంపింది భర్తా, ప్రియుడా..?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ చంపాపేట యువతి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు . స్వప్నను కత్తితో పొడిచి చంపింది ఆమె ప్రియుడా లేక ప్రేమ్ కుమారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

swapna murder case updates ksp
Author
First Published Oct 28, 2023, 9:49 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ చంపాపేట యువతి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. స్వప్న హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని వారు అనుమానిస్తున్నారు. మృతురాలు స్వప్నకు , ప్రేమ్ కుమార్‌కు నెల క్రితం వివాహం జరిగినట్లుగా సమాచారం. అయితే ప్రేమ్ కుమార్‌తో పెళ్లికి ముందే స్వప్నకు మరో యువకుడితో ప్రేమ వ్యవహారం వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే భర్త ప్రేమ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో ప్రియుడు రావడం.. ఒక్కసారిగా అతను వెనక్కి తిరిగి రావడం, ఈ సమయంలోనే ఘర్షణ జరిగి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్వప్నను కత్తితో పొడిచి చంపింది ఆమె ప్రియుడా లేక ప్రేమ్ కుమారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ప్రేమ్ కుమార్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కోమాలో వున్నాడు. 

అసలేం జరిగిందంటే :

శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో స్వప్న దంపతులు నివసిస్తున్న ఇంట్లో నుంచి పెద్ద శబ్ధం రావడంతో యజమాని లోపలికి వెళ్లి చూడగా స్వప్న రక్తపు మడుగులో పడి వుంది. మరో యువకుడు భవనం రెండో అంతస్తు నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు యువకులు ఇంట్లో నుంచి వేగంగా నడుచుకుంటూ రావడం చూశామని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో ఆ ఇద్దరు యువకులు ఎవరా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios