సోమవారం అసెంబ్లీలో కంటికి గాయం కావడంతో సరోజిని కంటి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్. ఆయనకు ప్రస్తుతం వైద్యం నడుస్తోంది. స్వామి గౌడ్ కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. కంటికి కట్టిన కట్టు ఇంకా అలాగే ఉంచారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వామి గౌడ్ ను రాజకీయ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లి పరామర్శించారు. ఇవాళ దేవాదాయ, హౌసింగ్ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. రెస్ట్ తీసుకోవాలని సూచించి ఐకె రెడ్డి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ ను పరామర్శించే వీడియోను దేవాదాయ శాఖ వర్గాలు మీడియాకు విడుదల చేశాయి.  వీడియో కింద ఉంది. స్వామి గౌడ్ ఎలా ఉన్నారో మీరూ చూడండి.