Asianet News TeluguAsianet News Telugu

రద్దయిన పాత కరెన్సీని.. కొత్త నోట్లుగా మార్చే స్వామీజీ.. రూ.2 కోట్ల దొంగనోట్లను తరలిస్తూ పట్టుబడ్డ ముఠా...

పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడని.. ఓ బాబా దగ్గరికి దాదాపు రెండు కోట్ల పాత కరెన్సీని తీసుకువెడుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 

Swamiji will change the cancelled old currency into new notes, fake currency gang arrested in mulugu
Author
First Published Oct 7, 2022, 7:18 AM IST

ములుగు : రద్దయిన కరెన్సీ, దొంగనోట్లను తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పి సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు. వెంకటాపురంలో గురువారం పోలీసులు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో రద్దయిన రూ.1000, రూ.500 నోట్లు లభ్యమయ్యాయి.  ఈ నోట్ల విలువ రూ. 1.65 కోట్లు. సూర్యాపేట జిల్లా కేశవాపూర్ కు చెందిన పప్పుల నాగేంద్రబాబు, కోదాడ మండలం సాలర్జింగ్ పేటకు చెందిన శ్రీరాముల నాగ లింగేశ్వరరావు, భద్రాచలం ఏఎంసీ కాలానికి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురంకి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డీ శివరాజ్, హైదరాబాద్ ఉప్పల్ బుద్ధనగర్ కు చెందిన ఆయుర్వేద వైద్యులు గంటా యాదగిరి, మలక్పేట బ్యాంకు కాలనీకి చెందిన ఠాకూర్ అజయ్ సింగ్, చత్తీస్ గడ్ కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాగేంద్రబాబు అప్పులు ఎక్కువ కావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు నాగ లింగేశ్వరరావు అలియాస్ నగేష్ ను కలిశాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బాబా పాత కరెన్సీని  కొత్త నోట్లుగా మారుస్తారని నాగ లింగేశ్వరరావు నమ్మించాడు. దీంతో హైదరాబాద్ కు చెందిన వెంకట్ రెడ్డి, నవీన్ రెడ్డికి రూ. ఐదు లక్షలు ఇచ్చి వారి వద్ద సుమారు రూ. రెండు కోట్ల రద్దయిన పాత కరెన్సీ, దొంగనోట్లను కొనుగోలు చేశాడు. ఆ సొమ్మును భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారినుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు,  9 ఫోన్ లు, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

కానిస్టేబుల్ తో ఎస్సై ప్రేమవివాహం.. ఆ తరువాత వేధింపులు...

Follow Us:
Download App:
  • android
  • ios