Asianet News TeluguAsianet News Telugu

జైలుకు సస్పెన్షన్ గురైన శ్రీనివాస్ రెడ్డి: విచారణకు మహబూబాబాద్ ఎస్పీ,తొర్రూర్ డిఎస్పీ

ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడికి పాల్పడిన మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని మహబూబాబాద్ జైలుకు తరలించారు. ఈ కేసు విచారణను మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, తొర్రూర్ డిఎస్పీ  వెంకటరమణలను నియమించారు.

suspended SI Srinivas Reddy shifted to Mahabubabad jail lns
Author
Warangal, First Published Aug 4, 2021, 10:45 AM IST

మహబూబాబాద్:ట్రైనీ మహిళ ఎస్ఐపై  లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టైన  ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ సబ్‌జైలుకు తరలించారు.ఈ నెల 2వ తేదీన ఓ కేసు విచారణ నిమిత్తం మహిళా ట్రైనీ ఎస్ఐను వాహనంలో ఒంటరిగా తీసుకెళ్లిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అటవీ ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ విషయమై బాధితురాలు వరంగల్ సీపీ తరుణ్ జోషీకి ఫిర్యాదు చేసింది.

also read:మహిళా ట్రైనీ ఎస్సైపై అడవిలో కీచక పర్వం: ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

ఈ ఫిర్యాదు మేరకు  మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు. సీపీ ఆదేశం మేరకు  ఎస్ఐపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయనపై సస్పెన్షన్ వేటు విధించారు. కేసు నమోదు చేయడంతో పాటు ఆయనను జడ్జి ముందు హజరుపర్చారు. జడ్జి ఆదేశాల మేరకు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు.

జడ్జి ఆదేశాల మేరకు సస్పెన్షన్ కు గురైన  శ్రీనివాస్ రెడ్డిని మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు. మరో వైపు ఈ కేసు విచారణను మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డితో పాటు తొర్రూరు డిఎస్పీ  వెంటకరమణకు అప్పగించారు వరంగల్ సీపీ తరుణ్ జోషి. లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై  నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకొంటామని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios