తెలంగాణలోని వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  ఫీజులో విషయంలో సుప్రీం సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణ ఫీజుల నియంత్రణా కమిటీకే ఫీజులను నిర్ణయించే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది కోర్టు.

తెలంగాణ ప్రవేశాల నియంత్రణా కమిటీ నిర్ణయం ప్రకారమే ఫీజులు ఉంటాయని తెలిపింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించకూడదని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. వాసవి, శ్రీనిధి కళాశాలల ఫీజుల విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం పక్కనబెట్టింది. 

ఇదే సమయంలో ఫీజుల నియంత్రణ విధానంలో తెలంగాణ సర్కార్ వైఖరిని సమర్ధించింది