కోవిడ్ టెస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పరీక్షల విషయంలో తమ ఆదేశాలు పాటించలేదంటూ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు ఇటీవల రాష్ట్ర హైకోర్టు... కోర్టు ధిక్కరణ నోటీసు ఇచ్చింది.

దీంతో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కరోనా నియంత్రణకు అవసరమైన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తుందని, రోజూ 50 వేల పరీక్షల నిర్వహణ కష్టమని కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం .. కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై స్టే ఇచ్చింది.