ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు: 4 వారాల్లో అఫిడవిట్ దాఖలుకు కేంద్రానికి ఈసీ ఆదేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై నాలుగు  వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని  కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.  జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపుతో ఈ పిటిషన్,ను విచారించలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. 

Supreme Court Orders Union government To file affidavit on Assembly seats increase in Andhra Pradesh and Telangana

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై నాలుగు వారాల్లో అపిడవిట్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని  సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఎనిమిది వారాల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు గురువారం నాడు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై  పర్యావరణ వేత్త  పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ పిటిషన్  విచారణకు ఉన్నత న్యాయస్థానం  ఈ ఏడాది సెప్టెంబర్ 19న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలను 119 నుండి 153కి, ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలను 225 కి పెంచేందుకు  ఏపీ పునర్విభజన చట్టం  అనుమతిని  ఇచ్చింది.ఈ చట్టం ఆధారంగా  రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంచుకొనేందకు ఈ చట్టం అనుమతించిందని  పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయమై  ఈ ఏడాది సెప్టెంబర్ 19న కేంద్ర ప్రబుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై స్పందించేందుకు  సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. నాలుగు వారాల్లోపుగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

 ఈ ఏడాది నవంబర్ 16, 17 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై విచారణ నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై విచారణ  గురించి పిటిషనర్ ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ తో  కలిపి ఈ అంశాన్ని ఎలా విచారిస్తామని సుప్రీంకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. ఎనిమిది వారాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై విచారణ  నిర్వహిస్తామనిసుప్రీంకోర్టు తెలిపింది.

also read:తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు: ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేదని గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్  రెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్  ఈ విషయాన్ని ప్రకటించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios