మంచిరేవుల భూములు: కేసీఆర్ సర్కార్‌కు సుప్రీంలో ఊరట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  మంగళవారంనాడు  సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Supreme Court  Key  Verdict on manchirevula 142 acres Land lns

హైదరాబాద్: రాష్ట్రంలోని మంచిరేవులలోని గ్రేహౌండ్స్ భూములు తెలంగాణవేనని  సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. 143 ఎకరాల గ్రేహౌండ్స్ భూములు తెలంగాణ సర్కార్ వేనని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.గండిపేట మండలం మంచిరేవులలోని  143 ఎకరాల భూములు తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఇదే విషయమై తెలంగాణ హైకోర్టు కూడ  కేసీఆర్ సర్కార్ కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.  

మంచిరేవులలోని  391/1 నుండి 391/20 లోని  143 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని 2021  డిసెంబర్ 31న  తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.

also read:ఆ భూములు ప్రభుత్వానివే: మంచిరేవుల భూములపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ఈ భూమి తమదని  2010లో  కొందరు తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై  తెలంగాణ ప్రభుత్వం,  పోలీస్ శాఖ  హైకోర్టులో  సవాల్ చేసింది.  ఈ పిటిషన్ పై విచారణ చేసిన  హైకోర్టు తీర్పును వెల్లడించింది.  తెలంగాణ హైకోర్టు తీర్పును  కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో కూడ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడైంది. మంచిరేవులలోని భూమిని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలోని గ్రేహౌండ్స్ విభాగానికి కేటాయించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios