Asianet News TeluguAsianet News Telugu

పురాతన కట్టడాలు: కేసీఆర్ సర్కార్‌కు సుప్రీం నోటీసులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. పురాతన కట్టడాల విషయంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగరి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం నోటీసులు ఇచ్చింది. 

Supreme court issues notice to Telangana government over heritage buildings
Author
Hyderabad, First Published Feb 14, 2020, 6:06 PM IST


న్యూఢిల్లీ:పురాతన కట్టడాలను పరిరక్షించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ పై తెలంగాణ సర్కార్‌‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

హెరిటేజ్ కట్టడాలను కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బొబ్డేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం నాడు విచారించింది.

Also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత: కేసీఆర్‌కు హైకోర్టు షాక్

గతంలో మాన్యుమెంట్స్ మ్యూజియం, హెరిటేజ్ కట్టడాలు హెరిటేజ్ చట్టంలో ఉండేవి. అయితే 132 కట్టడాలను ఈ లిస్టు నుండి తొలగించారు. తొలగించిన కట్టడాల్లో అసెంబ్లీ  భవనం, హైకోర్టు  ఎర్రమంజిల్ భవనాలు కూడ ఉన్నాయి. 

మాస్టర్ ప్లాన్‌లో ఆ భవనాలు ఉన్నందున వీటి పరిరక్షణ మున్సిపల్ శాఖ పరిధిలో ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరో 100 పురాతన భవనాలకు రక్షణ లేకుండా పోయిందని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios