ఓటుకు నోటు కేసు సంబంధించి కోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్ ని సుప్రీం కోర్టు చీఫ్  జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత దీనిని విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

పిటిషనర్ ఆర్కే తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఖచ్చితమైన విచారణ తేదిని నిర్ణయించాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. తమ లిఖితపూర్వక ఆదేశాల్లో ఇస్తామని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. 

అయినా ఆ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్ధించారు. రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే  సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే