Asianet News TeluguAsianet News Telugu

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం:సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గురువారం నాడు అనుమతిని ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు మాత్రం హుస్సేన్ సాగర్ లో అనుమతిని నిరాకరించింది.ఈ తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

Supreme court green signals for Ganesh idol immersion in  hussain sagar
Author
Hyderabad, First Published Sep 16, 2021, 12:02 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్  ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్  సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై గురువారం నాడు విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వినాయక విగ్రహల నిమజ్జనానికి అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదికి మాత్రమే సుప్రీంకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనానికి అనుమతిని ఇచ్చింది.

 

also read:ట్యాంక్‌బండ్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం:రేపు విచారణ చేస్తామన్న సుప్రీం

ఇదే  చివరి అవకాశమని కూడ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.హైకోర్టుకు ప్రభుత్వం సమగ్ర నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  ఆదేశించారు.హైద్రాబాద్ లో ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ్ గుర్తు చేశారు. హైద్రాబాద్ లో ఎప్పటి నుండో నిమజ్జనంపై ఈ సమస్య ఉందన్నారు. ఏటా ఎవరో ఒకరు పిటిషన్ వేస్తూనే ఉన్నారని సీజేఐ చెప్పారు.

వినాయక విగ్రహాలతో పాటు దుర్గామాత విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై  జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్  సుప్రీంకోర్టులో ఈ నెల 14న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.  ఈ పిటిషన్ ను రేపు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ నెల 19వ తేదీన వినాయక విగ్రహల నిమజ్జనం చేయాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకొంది. హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహల‌ను నిమజ్జనం చేస్తామని  భాగ్యనగర ఉత్సవ సమితి తేల్చి చెప్పింది.

వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం  చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు.ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులను  పాటించలేదని  ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా అమలు చేయాలని కూడ హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ సవాల్ చేసింది. రెండు రోజుల్లో ఈ విషయమై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని మంత్రి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios