సీట్ల కేటాయింపు విషయమై  టీఆర్ఎస్ లో  అసంతృప్తిని రగిలిస్తోంది. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత సునీల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు


హైదరాబాద్: సీట్ల కేటాయింపు విషయమై టీఆర్ఎస్ లో అసంతృప్తిని రగిలిస్తోంది. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత సునీల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుచరులు సునీల్ పై ఒత్తిడి తెస్తున్నారు.

బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వేముల ప్రశాంత్ రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్టును కేటాయించింది. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి కూడ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ నెల 12 వ తేదీన సురేష్ రెడ్డి టీఆరెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇదిలా ఉంటే బాల్కొండ టిక్కెట్టును ఆశించిన టీఆర్ఎస్ నేత సునీల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అనుచరులతో సునీల్ రెడ్డి సమావేశమయ్యారు.ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఆయనపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ టిక్కెట్లను కేటాయించారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి బయటపడింది. టిక్కెట్టు దక్కినవారంతా పక్కచూపులు చూస్తున్నారు.