Asianet News TeluguAsianet News Telugu

సునీల్ కనుగోలు.. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించిన వీరుడు...

తెలంగాణలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సునీల్ కనుగోలు. కేసీఆర్ లాంటి నాయకుడిని ఓటమి చవిచూసేలా చేసిన ఎన్నికల స్ట్రాటజిస్ట్. మనకాలపు చాణక్యుడు.

Sunil Kanugolu.. hero who behind the Congress victory in Telangana - bsb
Author
First Published Dec 4, 2023, 10:58 AM IST

తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయిందనుకున్న కాంగ్రెస్ రెట్టించిన వేగంతో దూసుకొచ్చింది. ఏకంగా 64 సీట్లను కైవసం చేసుకుని ఏనుగు కుంభస్థలాన్నే బద్దలు కొట్టింది. పదేళ్లుగా సాగుతున్న కేసీఆర్ ను.. ఆయన చుట్టూ వైఫైలా అల్లుకుని కాపాడుతున్న తెలంగాణ సెంటిమెంటును చేధించి మరీ ఓడించగలిగింది. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఎన్నో. వాటిగురించి కాదిప్పుడు చర్చ.. కాంగ్రెస్ గెలుపు వెనకున్న మాస్టర్ మైండ్ గురించి.. మనకాలపు చాణక్యుడి గురించి మాట్లాడుకోవాలి.

అతనే సునీల్ కనుగోలు.. తెలుగు మూలాలున్న బళ్లారీ యువకుడు. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్న 39యేళ్ల అపర చాణక్యుడు. తెలంగాణలో ఎన్నికలు ముగిసి, ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే గెలుపని ఖాయం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పేరు సునీల్ కనుగోలు. ఆయన తెలంగాణలో గతేడాది నుంచి పనిచేస్తున్నా ఇప్పుడు ఆయన గురించి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. 

సునీల్ కనుగోలు స్వస్థలం కర్ణాటకలోని బళ్లారి. వీరి కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి బళ్లారికి వలసవెళ్లినట్లుగా సమాచారం. వారిది తెలుగు మాట్లాడే కుటుంబం. సునీల్ కనుగోలు పుట్టిన తరువాత వారి కుటుంబం చెన్నైకి వచ్చి స్థిరపడింది. సునీల్ కనుగోలు అమెరికాలో చదువుకున్నారు. ఆ తరువాత అక్కడే ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో పనిచేశారు. 

ఆ తరువాత అక్కడినుంచి భారత్ తిరిగొచ్చారు. ఇక్కడ అప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ టీంలో చేరి పనిచేశారు. ఆ తరువాత ఆయననుంచి విడిపోయారు. సొంతంగా 'ఎస్కే.. అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్' అనే సంస్థను స్థాపించారు. దీనిమీద దేశంలో జరిగిన 14 ఎన్నికల్లో అనేక పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కోసం 2022 నుంచి పనిచేస్తున్నారు. 

T Raja Singh : గోషామహల్ మళ్లీ రాజా సింగ్ దే.. మూడో సారి విజయ ఢంకా మోగించిన బీజేపీ ఫైర్ బ్రాండ్..

ఇంతకీ ఆయన ఏం చేశారు??
- సునీల్ కొనుగోలు గురించి చెప్పాలంటే ముందుగా గుర్తు చేసుకోవాల్సింది రాహుల్ ’భారత్ జోడో యాత్ర’. దీనికి రూపకల్పన చేసింది సునీల్ కనుగోలు.  
- కర్ణాటకలో  కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వెనక ఉన్న కారణం కూడా సునీల్ కనుగోలే.
- కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మని నేరుగా టార్గెట్ చేసే విధంగా ఎన్నో ప్రచారాలు రూపొందించారు.
- ఇక 2015 ఎన్నికల్లో  ఎంకే స్టాలిన్ అధికారంలోకి రావడానికి..  మనకు మనమే పాలించుకుందామని నినాదాన్ని రూపొందించింది కూడా సునీల్ కనుగోలే.
- అంతకుముందు సునీల్ కనుగోలు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యక్తిగత విభకర్తగా కూడా పనిచేశారు.
- ప్రశాంత్ కిషోర్ తో కలిసి  సునీల్ కనుగోలు  సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్  అనే సంస్థను స్థాపించి నరేంద్ర మోడీని ప్రధానిగా చేయడంలో కృషి చేశారు.

- 2022 నుంచి సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు.  అంతకుముందు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్,  హిమాచల్ ప్రదేశ్లలో వివిధ పార్టీల కోసం విహకర్తగా పనిచేశారు. 

- సునీల్ కనుగోలు ఎలాంటి వ్యూహాలు రూపొందిస్తారో,  ఆయన వ్యూహాలు ఎంతగా ఫలిస్తాయో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొదట కర్ణాటక, ఆ తర్వాత ప్రస్తుతం తెలంగాణ.

- కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని డైరీ వ్యవహారాన్ని కన్నడ ఆత్మగౌరవంతో ముడిపెట్టినా, అప్పటి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మపై వచ్చిన కమిషన్ల ఆరోపణల వ్యవహారాన్ని ‘పే సీఎం’ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లినా.. దాని వెనక ఉన్నది సునీల్ కనుగోలే. 

- అంతకుమించి కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో.. సామాన్యుడిని మెప్పించేలా రూపొందించడంలో సునీల్ బృందం పాత్ర చాలా ఉంది. ప్రజాకర్షక పథకాలుగా మిగిలిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ విధానాలు బాగా ఆకట్టుకున్నాయి.

- అందుకే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆయనకు క్యాబినెట్ మినిస్టర్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా ఆఫర్ ఇచ్చింది.

- ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన ఆరు గ్యారెంటీల వెనక ఉన్నది సునీల్ కనుగోలు మైండే.
- ఇంకో ముఖ్యమైన.. ఇక్కడ కాంగ్రెస్ కి లాభించేలా చేసిన ఐడియా..  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిజెపితో కుమ్మక్కయ్యారని చేసిన ప్రచారం. దీనివల్ల మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. 

- కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించిన రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి రూ.200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం లాంటి వాటితో మహిళలను ఆకట్టుకున్నారు.

- రైతు భరోసా కింద రైతులకు ఇచ్చే మొత్తాన్ని కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తూ, రూ.15 వేలకు పెంచడం, వరి పంటకు ఏడాదికి రూ.500 బోనస్ ఇవ్వడం, వ్యవసాయ కార్మికులకు రూ. 12000 ఇవ్వడం వంటి అంశాలతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

- ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పథకాలతో.. అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ చేరడానికి సునీల్ కనుగోలు వ్యూహరచన చేశారు. ఇవే ఇప్పుడు సునీల్ కనుగోలు గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అపర చాణక్యుడిలా నిలబెట్టాయి.

Follow Us:
Download App:
  • android
  • ios