సీపీఐ సీనియర్ నేత సుధాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో మార్పులు రావాలన్న ఆయన.. కొత్త తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఎన్ని సార్లు చెప్పినా నాయకత్వం పట్టించుకోవడం లేదని అందుకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. 

సీపీఐకి (cpi) షాక్ తగిలింది. సీనియర్ నేత సుధాకర్ రెడ్డి (sudhakar reddy) రాజీనామా (resign) చేశారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు. 1974లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో (communist party of india) తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. ఎనిమిదేళ్లుగా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పోరాటాలు చేయడం లేదని.. కొత్త నాయకత్వానికి సంబంధించి రిక్రూట్‌మెంట్లు జరగడం లేదన్నారు. 

వచ్చిన యువ నాయకత్వాన్ని పొగొట్టుకుంటున్నారని.. ఇలాంటి పలు సమస్యలు పార్టీలో వున్నాయన్నారు. దీనికి సంబంధించి పలు సమావేశాలు, సదస్సుల్లో తెలియజేశానని సుధాకర్ పేర్కొన్నారు. కానీ నాయకత్వం ఎక్కడా పట్టించుకోలేదని ఆరోపించారు. కేరళ కమ్యూనిస్ట్ పార్టీలో యువ నాయకత్వానికి పెద్ద పీట వేస్తారని.. అక్కడ రెండు సార్లకు మించి పోటీ చేయడానికి వీల్లేదని సుధాకర్ చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీలో చీలికలు నష్టం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

"