గురుదేవోభవ అనిపించుకోవాల్సిన టీచర్ నీచ పనికి దిగజారాడు. క్లాస్ రూంలో విద్యార్థులకు అశ్లీల వీడియోలు చూపిస్తూ దారుణానికి తెగబడ్డాడు. పుచ్చిపోయిన బుద్దితో దారితప్ప ప్రవర్తించాడు. చివరికి విద్యార్థుల చేతిలో అవమానం పాలయ్యాడు. 

ఆదిలాబాద్ జిల్లా ఘోట్కూరీలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెడితే..  విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో ఉంచాల్సిన టీచర్.. కామ పాఠాలు బోధిస్తున్న సంఘటన ఆదిలాబాద్ లో కలకలం రేపింది. 

తరగతి గదిలో విద్యార్థులకు అశ్లీల దృశ్యాలు చూపిస్తోన్న స్కూల్ ప్రిన్సిపల్ ఖధీర్ ను తరగతి గదిలోనే బంధించారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేశారు. గతంలో కూడా ఇలాగే ఇతను వ్యవహరించారని, అప్పుడు హెచ్చరించినా తీరు మార్చుకోలేదని  గ్రామస్తులు తెలిపారు. ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.