పబ్జీగేమ్ మరో విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వఎళితే.. నిజామాబాద్ 19 వ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు శ్రేయాస్.. సమీపంలోని పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా శ్రేయాస్ పబ్జీ గేమ్ కి బానిసగా మారాడు. చదువు పక్కన పెట్టి ఆటకే అంకితతమయ్యాడు.

ఈ విషయంలో శ్రేయాస్ ని తల్లిదండ్రులు మందలించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రేయాస్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.