బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం..హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి జారిపడి విద్యార్థిని మృతి..

బాసర త్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి పడి మృతి చెందింది. అయితే ఇది ఆత్మహత్యా.. ప్రమాదవశాత్తు జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Student died after jumping from hostel building in Basara Triple IT - bsb

బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ బిల్గింగ్ నాలుగో అంతస్తు నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన అర్థరాత్రి 2. గంటల సమయంలో జరిగింది. వెంటనే ఆమెను నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడే ఆమె మృతి చెందింది. అయితే ఆమె ప్రమాదవశాత్తు జారి పడిందా? లేక ఆత్మహత్యా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మృతురాలు పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతుున్న లిఖితగా గుర్తించారు. లిఖిత స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మొదట ప్రాథమిక చికిత్స అందించి.. భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి నిర్మల్ కు తీసుకెళ్లారు. దీనిమీద వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios