హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులను ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ విద్యార్ధి అఖిల్ మంగళవారం నాడు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది.మంగళవారంనాడు మధ్యాహ్నం  నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణను చేపట్టనుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకు విద్యాసంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.

ఇప్పటికే 15 రోజులకుపైగా దసరా సెలవులు ఇచ్చారు. దసరాసెలవులను మరో వారం రోజుల పాటు పొడిగించడంతో సిలబస్  సకాలంలో పూర్తి చేయడం కష్టంగా మారే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.  ఉపాధ్యాయులకు ఇతరత్రా బాధ్యతలను కూడ అప్పజెప్పే అవకాశం ఉన్నందున సిలబస్ ను పూర్తి చేసేందుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదు.

ఆర్టీసీ సమ్మెను పురస్కరించుకొని స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో విద్యార్ధులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో  స్కూళ్లను వెంటనే తెరిపించాలని  అఖిల్ అనే విద్యార్ధి  మంగళవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖల చేశారు.ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం నాడు మధ్యాహ్నం హైకోర్టు  ఈ పిటిషన్‌పై విచారణ చేయనుంది.