సూర్యపేటలో విద్యార్థుల గర్జన

student agitation
Highlights

  • పీజు రీయింబర్స్ మెంట్ పై ఆందోళన
  • కలెక్టరేట్ ను ముట్టడించిన టిజివిపి
  • ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన విద్యార్థులు

 

 

ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలంటూ సూర్యపేట్ లో టీజీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వందల మంది విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్‌ను ముట్టడించడంతో ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. ఆందోళనకారులు పోలీసులకు తోసుకుంటూ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కలెక్టర్‌ ఛాంబర్‌లోని ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

ఈ ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులు కలెక్టర్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఆందోళనపై పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినా... బందోబస్తు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

 

 

loader