హైదరాబాద్: ఐటీ గ్రిడ్ సంస్థలో కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇంచార్జ్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శనివారం ఆయన ఐటీ గ్రిడ్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తమ సిట్ బృందం సభ్యులు సోదాలు నిర్వహించారని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నమని చెప్పారు. అన్ని కంప్యూటర్లను క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని, స్వాధీనం చేసుకున్న కీలక సమాచారాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిస్తున్నామని వివరించారు. 

అశోక్‌ క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేస్తామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఐటీ గ్రిడ్‌ కార్యాలయంలోని 60 హార్డ్‌డిస్క్‌లను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. 

ఇప్పటికే ఏడు హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేసిన మాదాపూర్‌ పోలీసులు తాజాగా 60 హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఐటి గ్రిడ్ కంపెనీలో సిట్ అధికారులు సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు.