ఐదు చీరలకు ఒక పాత్ర.. స్టీల్ సామాను షాపుల్లోకి బతుకమ్మ సారె, వీడియో వైరల్

తెలంగాణా ప్రభుత్వం (telangana govt) ప్రతిష్ఠాత్మకంగా అందజేసే బతుకమ్మ చీరలు (bathukamma sarees) స్టీల్ సామాన్ల (steel shops) పాలవుతున్నాయి. స్వయంగా మంత్రి కేటీఆర్ (ktr) ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో (rajanna sircilla) ఈ ఘటన చోటు చేసుకుంది

steel saman vendors buying bathukamma sarees in rajanna sircilla

తెలంగాణా ప్రభుత్వం (telangana govt) ప్రతిష్ఠాత్మకంగా అందజేసే బతుకమ్మ చీరలు (bathukamma sarees) స్టీల్ సామాన్ల (steel shops) పాలవుతున్నాయి. స్వయంగా మంత్రి కేటీఆర్ (ktr) ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో (rajanna sircilla) ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 330 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తయారుచేసిన బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు బతుకమ్మ పండగ కానుకగా ఇస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఐదు చీరలు ఇస్తే ఒక వంట పాత్ర తీసుకునే పరిస్థితికి సిరిసిల్ల బతుకమ్మ చీర వచ్చిందంటే చీరల విలువేంటో అర్థమవుతోంది.

గతేడాది ఇవే బతుకమ్మ చీరలు తంగళ్ళపల్లి (thangallapally) మండలంలో ఓ రైతు పొలాలకు కంచెలా వాడుకోగా ఈసారి స్టీల్ సామాన్ల కోసం చీరలను ఇచ్చేయడం గమనార్హం.  సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 3000 పైచిలుకు చీరలను తీసుకొని వాటి బదులుగా వంట పాత్రలను ఇచ్చి తీసుకువెళ్లే క్రమంలో పట్టణంలోని పాత బస్టాండ్‌లో బతుకమ్మ చీరల మూటలు కనిపించడం వైరల్ అవుతోంది. 

బతుకమ్మ చీరల కోసం తెలంగాణా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.  కానీ ఆ సోమ్ముతో కార్మికులు కానీ ఆసాములు కానీ ఎవరూ లాభపడటం లేదని.. కేవలం కొందరు స్థానిక టీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఖీతం శ్రీనివాస్ ఆరోపించారు. బతుకమ్మ చీరలకంటే దళితబంధులా పద్మశాలీ బంధు అమలు చేస్తేనైనా చేనేత కుటుంబాలు బాగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సిరిసిల్ల చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడానికి, అలాగే, బతుకమ్మ సందర్భంగా తెలంగాణ మహిళలను గౌరవించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లుపైబడిన మహిళలందరికీ ఈ చీరలను పంపిణీ చేస్తోంది. ఇందుకోసం 2017లో 95,48,439 మహిళా లబ్దిదారులకు.. 2018లో 96,70,474 మహిళా లబ్దిదారులకు, 2019లో 96,57,813 మహిళా లబ్దిదారులకు, 2020లో 96,24,384 మహిళా లబ్దిదారులకు చీరలను పంపిణీ చేసింది ప్రభుత్వం. 

 

"

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios