దామోదర రాజనర్సింహతో తాటికొండ రాజయ్య భేటీ.. కాంగ్రెస్‌లోకి వెళ్తారా, ఏం జరుగుతోంది..?

బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.  కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో రాజయ్యకు టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే .

station ghanpur mla thatikonda rajaiah meets congress leader damodar raja narasimha ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని ఆశావహులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. వీరిలో మెజారిటీ మంది కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అవుతుండగా.. బీజేపీ వైపు అంతంత మాత్రమే. తాజాగా బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సోమవారం వరంగల్‌లోని నయీంనగర్‌లో జరిగిన ఎస్సీ సమావేశంలో ఇద్దరు నేతలు కలుసుకున్నారు.

కాగా.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి , తాటికొండ రాజయ్య వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. వచ్చే తెలంగాణ ఎన్నికల కోసం ఇక్కడ సిట్టింగ్‌గా వున్న రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం కల్పించారు. అయితే దీనిని రాజయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. నిత్యం కడియంను ఏదో రకంగా టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసునని రాజయ్య వ్యాఖ్యానించారు. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో వుండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైంది కాదన్నారు. 

ALso Read: 'ఆమె తెలంగాణ కోడలయితే.. నేను ఆడబిడ్డని..' : షర్మిలపై రేణుకా చౌదరి ఫైర్

బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు అదే పనిలో వున్నారు. ఈ క్రమంలో నవ్య మరోసారి తెరపైకి వచ్చారు. తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఒక మహిళ ఎమ్మెల్యే అయితే ఆడపడుచులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలు కలుగుతుందని నవ్య చెప్పారు. మాదిగ బిడ్డనైన తనకు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి అవకాశం కల్పించాలని ఆమె కోరారు. కేసీఆర్ ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తానని ఆమె పేర్కొన్నారు. 

కొద్దిరోజుల క్రితం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం ఎమ్మెల్యే నవ్యల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తనను రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడని.. కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ నవ్య ఆరోపణలు గుప్పించారు. తనపై వ్యామోహంతోనే సర్పంచ్ టికెట్ ఇప్పించానని రాజయ్య అంటున్నాడని.. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో రాజయ్య స్వయంగా నవ్య ఇంటికి వెళ్లి రాజీ కుదుర్చుకోవడం, గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios