హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని ఉప్పుగూడ కృష్ణానగర్‌లో విషాదం సంఘటన జరిగింది. స్థానికంగా నివసించే నరేశ్ అనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. 

ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన నరేశ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే టెన్త్ ఫెయిలవుతాననే భయంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నరేశ్ తల్లిదండ్రులు ఖండించారు. 

ఇంకా పరీక్షా ఫలితాలకు సమయముందని, అలాంటిదేమీ లేదని వారన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.