టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసు:తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ క్వాష్ పిటిషన్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్   ఇవాళ తెలంగాణ హైకోర్టును  ఆశ్రయించారు. 

SSC hindi Paper leak: Bandi Sanjay Files quash Petition In Telangana High Court lns

హైదరాబాద్; బీజేపీ  తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  బుధవారంనాడు  తెలంగాణ  హైకోర్టును ఆశ్రయించారు.   టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లక్ కుట్ర కేసులో  తనపై  నమోదైన   ఎప్ఐఆర్ ను  కొట్టివేయాలని  బండి సంజయ్ తెలంగాణ హైకోర్టును  ఆశ్రయించారు.

ఈ నెల 4వ తేదీన  టెన్త్ క్లాస్ హిందీ  పేపర్ లీక్  అయిందని  సోషల్ మీడియాలో   ప్రచారం జరిగింది. హిందీ  పేపర్ లీక్ కుట్ర కేసులో  ఉమ్మడి  కరీంనగర్ జిల్లా కమలాపూర్  పోలీస్ స్టేషన్ లో  బండి సంజయ్ పై  ఎఫ్ఐఆర్ నమోదైంది. 

ఈ నెల  4వ తేదీ రాత్రి  బండి సంజయ్ ను   పోలీసులు అరెస్ట్  చేశారు. కరీంనగర్ నుండి  అదే రోజు రాత్రి బొమ్మలరామారం  పోలీస్ స్టేషన్ కు  తరలించారు.  బొమ్మలరామారం నుండి  బండి సంజయ్ ను  హన్మకొండ  మేజిస్ట్రేట్  ముందు హాజరుపర్చారు.  మేజిస్ట్రేట్   బండి సంజయ్ కు రిమాండ్  విధించారు.  ఈ నెల  6వ తేదీన  బండి సంజయ్ కు  హన్మకొండ  కోర్టు  బెయిల్ ను మంజూరు చేసింది.   ఈ  నెల  7వ తేదీన  బండి సంజయ్  కరీంనగర్  జైలు నుండి విడుదలయ్యారు. 

also read:ధర్మం గెలిచిందన్న ప్రశాంత్: కరీంనగర్ జైలు నుండి టెన్త్ క్లాస్ పేపర్ లీక్ నిందితుడు విడుదల

టెన్త్ క్లాస్ హిందీ  పేపర్ లీక్ కుట్ర కేసులో  బండి సంజయ్  ఏ1 నిందితుడని  వరంగల్ సీపీ  రంగనాథ్ ప్రకటించారు.  బండి సంజయ్  మొబైల్ ఫోన్  లభ్యమైతే  ఈ కేసులో  మరిన్ని  విషయాలు వెలుగు  చూస్తాయని  వరంగల్ పోలీసులు  చెబుతున్నారు.  అయితే   తన  ఫోన్ పోయిందని  బండి సంజయ్  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.  ఇటీవల  విచారణకు  రావాలని కమలాపూర్ పోలీసులు  పంపిన నోటీసుకు బండి సంజయ్   తన లీగల్ టీమ్ ద్వారా  సమాధానం పంపారు. టెన్త్  క్లాస్  హింీ  పేపర్ లీక్ కుట్ర కేసులో  తనపై  నమోదైన  ఎఫ్ఐఆర్ ను రద్దు  చేయాలని  బండి సంజయ్  తెలంగాణ హైకోర్టులో  క్వాష్ పిటిషన్ దాఖలు  చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios