దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మీటూ ప్రకంపనలు తెలంగాణను తాకాయి. దేశంలో అందరికంటే మీటూ ఉద్యమానికి తెరలేపింది సినీనటి. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. సినిమాల్లో అవకాశాలు కావాలంటే గెస్ట్‌హౌస్‌కి వెళ్లాల్సిందే అంటూ పరిశ్రీమకు చెందిన చాలా మంది పేర్లను బయటపెట్టింది.

వీళ్లంతా నన్ను వాడుకున్నారు కానీ నాకు అవకాశాలు ఇవ్వలేదంటూ పెద్ద బాంబు పేల్చింది. ప్రస్తుతం హైదరాబాద్ వదిలేసి చెన్నై చెక్కేసిన శ్రీరెడ్డి కొంతకాలం సైలెంట్‌గానే ఉంది. అయితే మీటూ ఎఫెక్ట్ పుణ్యమా అని మళ్లీ నిద్రలేచింది.

టీఆర్ఎస్ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది. చెన్నైలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది.

జీవన్‌రెడ్డి పెద్ద అమ్మాయిల పిచ్చోడని.. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో చాలామంది అమ్మాయిలను వాడుకున్నాడని.. అలా అతని అత్యాచారాలకు బలైన చాలామంది అమ్మాయిల పేర్లు తన వద్ద ఉన్నాయన్నారు.

తనపైనా రెండు, మూడు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. కానీ తాను లొంగిపోలేదన్నారు. ఈ క్రమంలో తాను స్లీపింగ్ ప్రొడ్యూసర్‌ని అని.. అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి అంతా నా చేతిలోనే ఉందన్నాడు.

ఒక రోజు నిర్మాత బెల్లంకొండ సురేశ్ పార్క్‌హయత్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశాడని.. ఈ సమావేశానికి జీవన్ రెడ్డి కూడా వచ్చాడని.. ఆ సమయంలో తనను బలవంతపెట్టాలని చూశాడని.. కానీ తాను అందుకు ఒప్పుకోలేదని.. ఇదే సమయంలో నా ఫ్రెండ్స్‌ని చాలా మందిని వాడుకున్నాడని శ్రీరెడ్డి బాంబు పేల్చింది.

ఈ వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీరెడ్డికి ఇచ్చిన ఇంటర్య్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవన్‌రెడ్డికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. 

"