హైదరాబాద్‌‌ శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాల్సిన విమానం షెడ్యూల్ ప్రకారం ఉదయం 6.55 గంటలకు బయలుదేరాలి.. 

హైదరాబాద్‌‌ శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాల్సిన విమానం షెడ్యూల్ ప్రకారం ఉదయం 6.55 గంటలకు బయలుదేరాలి.. అయితే టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు విమానాన్ని నిలిపివేశారు.

దీంతో రెండు గంటల నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యను సరిచేసేందుకు నిపుణులు శ్రమిస్తున్నారు. ప్రయాణికుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు కూడా ఉన్నారు.