హైదరాబాద్ : కొత్త సంవత్సరం తరువాత అందరికీ గుర్తుండేది సంక్రాంతి పండుగ. చాలా మంది సంక్రాంతి పండుగకి  వారి సొంత ఉర్లల్లోకి, బంధువుల ఇంటికి వెళ్తుంటారు. సంక్రాంతి పండుగకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అలాగే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ఏర్పాట్లను చేశాయి.

 పండుగకు హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు, ఉర్లకు వెళ్లేందుకు అదనపు బస్సులు, రైళ్ళను నడిపించనున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యప్రాంతాలకు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు రెగ్యులర్‌ సర్వీస్‌లతో పాటు అదనపు బస్సులను నడిపిస్తున్నారు.

also read యువతి గొంతు కోసిన ప్రమోన్మాది

హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్లతోపాటు జంటనగరాలలోని శివారు ప్రాంతాలు, ముఖ్య కేంద్రాల నుంచి పండుగ సంధర్భంగా బస్సులను ఆపరేట్‌ చేసేందుకు నిర్ణయించారు. సీబీఎస్‌, ఉప్పల్‌ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్‌, లింగంపల్లి, చందానగర్‌, ఈసీఐయల్‌, కేబీహెచ్‌బీ, ఎస్సార్‌ నగర్‌, అమీర్‌పేట, టెలిఫోన్‌ భవన్‌ ప్రాంతాలతోపాటు ఆధీకృత టికెట్‌ బుకింగ్‌ ఏజంట్ల వద్ద నుండి కూడా ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశారు.


పండుగ కారణంగా ప్రత్యేకంగా నడిపే అదనపు బస్సులు జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. అదనపు బస్సుల కోసం అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగకుండా ప్రయాణీకుల సుఖ ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని అంతర్‌ రాష్ట్ర, వోల్వో బస్సులను మినహాయించి మిగతా అన్నీ బస్సులను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులను ఆపరేట్‌ చేస్తారు. ఇప్పటికే బస్సులు ప్రారంభం కాగా అదనపు బస్సులు శుక్రవారం నుండి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ,రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్పాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు,పామూరు,పొదిత తదితర ప్రాంతాలకు నగరం నుంచి బస్సులు ఆపరేట్‌ చేయనున్నారు.

also read మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

జూబ్లీబస్‌ స్టేషన్‌, పికెట్‌ నుంచి : కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల వైపు వెళ్లే బస్సులు
నడుపుతారు.

సీబీఎస్‌ నుండి : కర్నూల్‌, అనంతరపురం, కడప,చిత్తూరు, ఒంగోలు, మాచెర్ల, నెల్లూరు వైపు వెళ్లే బస్సులు
నడుపుతారు. 

ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు, ఉప్పల్‌ బస్‌స్టేషన్‌ నుంచి : యాదగిరిగుట్ట, వరంగల్‌, వైపు వెళ్లు బస్సులు వెళ్లే బస్సులు
నడుపుతారు.

దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌ నుండి : మిర్యాలగూడ,నల్గొండ, కోదాడ, సూర్యాపేట వెళ్లే బస్సులు
నడుపుతారు.