Agnipath Protests : సికింద్రాబాద్, విశాఖపట్నంలలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు... వివరాలు ఇవే...

శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అగ్నిఫథ్ రిక్రూట్ మెంట్ స్కీం కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. 

Southern Central Railway Cancels Several Trains in View of Agnipath Protests

సికింద్రాబాద్ : అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో శనివారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా.. ఇంకొన్నింటిని దారి మళ్లించింది. నిన్న ఉదయం చేపట్టిన నిరసనలు సాయంత్రానికి సద్దుమణగడంతో రైళ్లను పునరుద్ధరించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అలాగే కొన్ని రైళ్లను నడిపించారు. అయితే, శనివారం ఉదయం కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 

ఈ మేరకు 11 రైళ్లు, 6 ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 3 ట్రైన్లను రీ షెడ్యూలింగ్ చేశారు. 8 ట్రైన్లను మళ్లించారు. రద్దయిన ట్రైన్ల వివరాల విషయానికి వస్తే.. త్రివేండ్రం సెంట్రల్ -సికింద్రాబాద్ శబరి ఎక్స్ ప్రెస్ (19వ తేదీ), మన్మడ్-సికింద్రాబాద్ అజంతా ఎక్స్ ప్రెస్, షిర్డీ సాయినగర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (18వ తేదీ), దనాపూర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (19వ తేదీ), భువనేశ్వర్ సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (18,19తేదీ), షాలిమార్ సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (19వ తేదీ), భువనేశ్వర్ సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (18, 19 తేదీ), షాలిమార్ సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (19వ తేదీ), విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్ (19వ తేదీ), కేఎస్ఆర్ బెంగళూరు-ధనాపూర్ సంఘమిత్ర (17వ తేదీ), కాకినాడ పోర్ట్-విశాఖపట్నం మెము (18వ తేదీ), విశాఖపట్నం కాకినాడ పోర్టు మెము-(18 వతేదీ), మిగిలినవి హైదరాబాద్ ఎంఎంటీస్ సర్వీసులున్నాయి. 

విశాఖపట్నంనుంచి రద్దయిన రైళ్ల వివరాలు ఇవి.. 
7240 విశాఖ గుంటూరు రద్దు సింహాద్రి ఉదయం వెళ్ళేది
12805 జన్మభూమి రద్దు 
17015 భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ రద్దు
12728 హైదరాబాద్ 2 విశాఖ రద్దు, గోదావరి ఎస్ప్రెస్ కూడా...
128 62 కాచిగూడ రద్దు....
127 40  గరీబ్ రాద్ రద్దు..ఇది దువ్వడా లో ఆగింది

కడప విశాఖ ట్రైన్ తిరుమల దువ్వడా లో ఆగింది. Ltt  దువ్వడా కూడా రాలేదు.

డైవర్ట్ ట్రైన్స్...

సింహాచలం నార్త్ వైపు వెళ్లినవ ట్రైన్స్...

సెంట్రగచి చెన్నె వెళ్లి పోయింది
చెన్నె హౌరా 
దనబాద్ అల్లేప్ 
నాస్కోడిగామా హౌరా
టాటా యస్వబ్త్ పూర్
గుంటూరు రాయగలరు
తిరుచునాపల్లి ఎలా రా
బెంగళూరు భువనేశ్వర్

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios