Asianet News TeluguAsianet News Telugu

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన దక్షిణ కొరియా విద్యార్ధులు

భారతదేశ జీవన విధానం, అభివృద్ధి, పరిపాలన, రైతుల గురించి తెలుసుకోవడానికి దక్షిణ కొరియాకి చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులు రెండు నెలలు పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం ఈ బృందం హైదరాబాద్‌కు వచ్చి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిశారు

south korea students meet telangana minister errabelli dayakar rao
Author
Hyderabad, First Published Sep 1, 2019, 4:41 PM IST

భారతదేశ జీవన విధానం, అభివృద్ధి, పరిపాలన, రైతుల గురించి తెలుసుకోవడానికి దక్షిణ కొరియాకి చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులు రెండు నెలలు పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం ఈ బృందం హైదరాబాద్‌కు వచ్చి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిశారు.

south korea students meet telangana minister errabelli dayakar rao

ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యక్రమాలను.. ముఖ్యంగా త్రాగునీటి ఏర్పాట్ల గురించి విద్యార్ధులు తెలుసుకున్నారు.

ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడంతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios