Asianet News TeluguAsianet News Telugu

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 32 ప్రత్యేక రైళ్లు.. ఏయే మార్గాల్లో

Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.పండుగ సందర్భంగా సొంతూళ్ల‌కు చేరుకోవాలనుకునే వారి కోసం  జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32  ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు తెలిపింది. 

South Central Railway to run 32 special trains between ap and telangana states KRJ
Author
First Published Jan 3, 2024, 12:10 AM IST

Special Trains: తెలుగువారి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒక్కటి.. ఈ పండుగకు సొంత వూరిలో ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. ఇందుకోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి గమ్యానికి చేరుకుంటారు . బస్సులు, రైళ్లలో బుకింగ్ ఓపెన్ చేసిన నిముషాల్లోనే టికెట్లు నిండుకుంటాయి. పెద్ద పండగకి ఎన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రయాణీకులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 

ప్రత్యేక రైళ్లు ఇవే !

సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ , బ్రహ్మపూర్ - వికారాబాద్, విశాఖపట్నం - కర్నూలు సిటీ, శ్రీకాకుళం - వికారాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - కాకినాడ టౌన్, సికింద్రాబాద్ - నర్సాపూర్ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
 
ఏ రోజు ఏ రూట్ల‌లో..

జనవరి 7, 14 తేదీల్లో.. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07089) 
జనవరి 8, 15 తేదీల్లో- బ్రహ్మాపూర్ – వికారాబాద్ (07090) 
జనవరి 9, 16 తేదీల్లో- వికారాబాద్ – బ్రహ్మపూర్ (07091) 
జనవరి 10, 17 తేదీల్లో- బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07092) 
జనవరి 10, 17, 24 తేదీల్లో- విశాఖపట్నం – కర్నూలు సిటీ (08541)
జనవరి 11, 18, 25 తేదీల్లో-  కర్నూల్ సిటీ – విశాఖపట్నం (08542) 
జనవరి 12, 19, 26 తేదీల్లో-  శ్రీకాకుళం – వికారాబాద్ (08547) 
జనవరి 13, 20, 27 తేదీల్లో- వికారాబాద్ – శ్రీకాకుళం (08548) 
జనవరి 10, 17 తేదీల్లో- సికింద్రాబాద్ – తిరుపతి (02764) 
జనవరి 10 తేదీన నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) 
జనవరి 11 తేదీన సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) 
జనవరి 11, 18 తేదీల్లో- తిరుపతి – సికింద్రాబాద్ (02763) 
జనవరి 12 తేదీన.. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271)  
జనవరి 13 తేదీన.. కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07272) 
జనవరి 8, 15 తేదీల్లో..  సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) 
జనవరి 9, 16 తేదీల్లో.. బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios