తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి షెడ్యుళ్లు కూడా రైల్వే శాఖ ప్రకటించింది.

హైదరాబాద్ : ఉగాదికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు వీటిని నడపనుంది. కాకినాడ-సికింద్రాబాద్ (07593)31న రాతి 8.45కి, సికింద్రాబాద్ -కాకినాడ (07594) 1న రాత్రి 8.45గంటలకు , కాకినాడ-తిరుపతి (07595) 2న రాత్రి 9.00 గంటలకు, తిరుపతి-సికింద్రాబాద్ (07596)3న రాత్రి 7.50కి బయలుదేరుతాయి. గుంటూరు-హుబ్లీ (07591) 3న సాయంత్రం 4.30గంటలకు , హుబ్లీ-గుంటూరు (07592) 4న ఉదయం 9.25కి, కికింద్రాబాద్ -తిరుపతి (07597)1న రాత్రి 8.15కి, తిరుపతి-కాకినాడ్ (07598)2న రాత్రి 9.55 గంటలకు, కాకినాడ టౌన్-వికారాబాద్ (07599) 3న రాత్రి 8.45కు, మచిలీపట్నం-తిరుపతి (07095)1న సాయంత్రం 6.25 గంటలకు, తిరుపతి-మచిలీపట్నం (07096) 2న రాత్రి 10.15 గంటలకు బయలుదేరతాయని అధికారులు తెలిపారు.

కాగా, సికింద్రాబాద్- మహబూబ్ నగర్ల మధ్య రైల్వే డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పేర్తయ్యాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఉందానగర్-గొల్లపల్లి నడుమ విద్యుదీకరించిన లైన్లు కూడా వినియోగంలోకి వచ్చాయన్నారు. డబ్లింగ్ పూర్తితో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు మెరుగుపడతాయన్నారు.