రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. త్వరలోనే ఆయన మంత్రి వర్గ విస్తరణ కూడా చేయనున్నారు. గతంలో తన కుమారుడు కేటీఆర్ కి ఐటీశాఖ మంత్రి పదవి అప్పగించిన కేసీఆర్... ఈసారి మాత్రం మంత్రి వర్గంలో చోటు ఇవ్వడం లేదని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి తన జోరును చూపించింది. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. త్వరలోనే ఆయన మంత్రి వర్గ విస్తరణ కూడా చేయనున్నారు. గతంలో తన కుమారుడు కేటీఆర్ కి ఐటీశాఖ మంత్రి పదవి అప్పగించిన కేసీఆర్... ఈసారి మాత్రం మంత్రి వర్గంలో చోటు ఇవ్వడం లేదని సమాచారం.
కేటీఆర్ కి ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ పదవిలో ఉండి.. కేటీఆర్ రాబోయే ఐదారు నెలలపాటు పూర్తిగా పార్టీ కార్యకలాపాలు, ఎన్నికలకు పరిమితమౌతారని.. వాటిని విజయవంతం చేయడంపైనే ఆయన దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో.. కేటీఆర్ కి మంత్రివర్గంలో చోటు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే.. త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. ఆలోపు కేటీఆర్ ని ముఖ్యమంత్రి ని చేసి.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు చూసుకుంటురానే ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా ఈ సారి ఉపముఖ్యమంత్రి పదవులు కూడా ఉండకపోవచ్చని తెలుస్తోంది. తమ పార్టీ పట్ల విధేయంగా ఉన్నవారికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారని సమాచారం.
