హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్  సోనియగాంధీ ఈ నెల 19వ తేదీ తర్వాత తెలంగాణలో పర్యటించనున్నారు.నాలుగు బహిరంగసభల్లో సోనియాగాంధీ పాల్గొనే అవకాశం ఉంది.

సోనియాగాంధీ బహిరంగ సభలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు  రూట్‌మ్యాప్‌ను తయారు చేస్తున్నారు.  ఈ నెల 22, 23 తేదీల్లో సోనియా గాంధీ పర్యటన ఉండేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణను రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా  వ్యవహరించిందనే విషయాన్ని కూడ పార్టీ నేతలకు వివరించనున్నారు.   కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య  సమన్వయం కోసం కూడ సోనియాగాంధీ ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణలో  ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరాన్ని సోనియాగాంధీ పార్టీ నేతలకు నొక్కి చెప్పనున్నారు.

ఉత్తర తెలంగాణలోని 2 సభలు, దక్షిణ తెలంగాణలో రెండు సభలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏ ఏ ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేయాలనే దానిపై  ఇంకా  స్పష్టత రావాల్సి ఉంది.