భర్తను చంపి సాధారణ మరణంగా అదరినీ నమ్మించింది ఓ సాప్ట్ వేర్ మహిళ. అయితే రెండునెలల తర్వాత తండ్రిని తల్లే చంపిందని బయటపెట్టాడు పదకొండేళ్ల కొడుకు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది ఓ మహిళ. ఆమె మాటలునమ్మిన కుటుంబసభ్యులు కూడా అంత్యక్రియలు పూర్తిచేశారు. అంతా ఆమె అనుకున్నట్లే జరుగుతున్న సమయంలో పన్నెండేళ్ల కొడుకు అసలు నిజాన్ని బయటపెట్టాడు. తన తల్లే తండ్రిని చంపిందని బయటపెట్టడంతో రెండునెలల తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే... కాకినాడ మధురానగర్ కు చెందిన జగదీష్(43) కు సుస్రితతో 200లో పెళ్లయింది. దంపతులు పదకొండేళ్ళ కొడుకుతో కలిసి హైదరాబాద్ లో నివాసముండేవారు. అయితే ఈ ఏడాది జూలై 15న ఇంట్లో వుండగా జగదీష్ గుండెపోటుతో చనిపోయినట్లు సుస్రిత అత్తింటివారికి సమాచారమిచ్చింది. దీంతో అతడి మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలించి అంత్యక్రియలు చేశారు. 

జగదీష్ అంత్యక్రియలతో పాటు అన్ని కార్యక్రమాలను ముగించి కొడుకు రోహిత్ తో కలిసి హైదరాబాద్ కు తిరిగివచ్చింది సుస్రిత. తల్లి వద్ద ఒంటరిగా వుంటున్న రోహిత్ కొన్నాళ్లు తమవద్ద వుంచుకుంటామని బాబాయ్ రాజేష్ తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే అమ్మే నాన్నను చంపిందని రోహిత్ బాబాయ్ కుటుంబసభ్యులకు తెలిపాడు. చున్నీని నాన్న మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపిందని తెలిపాడు. తల్లి తండ్రిని ఎలా చంపిందో కూడా తెలపడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు పిర్యాదు చేశారు.

read more క్షణికావేశంలో మైనర్ బాలికపై అత్యాచారం... భయంతో నిందితుడి ఆత్మహత్యాయత్నం

వీరి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడకు వెళ్లి జగదీష్ మృతదేహాన్ని బయటకు తీసి మరోసారి శవ పంచనామా చేయించాలని భావిస్తున్నట్లు ఎస్సై రవిరాజ్‌ తెలిపారు.