మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరో అంతస్తు నుంచి దూకి బలవనర్మరణం చెందాడు. 

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మియపూర్ దీప్తిశ్రీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉంటున్న బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి దూకి సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డిండ్ పై నుంచి పడ్డ సందీప్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే అతని ల్యాప్‌ ట్యాప్‌ కూడా పైనుంచి కిందపడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 

సందీప్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా మియాపూర్ పోలీసులు తెలిపారు. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీరు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఆసరా (09820466726).. వంటి సంస్థలను సంప్రదించండి)