ప్రేమించి పెళ్లి చేసుకొన్న రెండు మాసాలకే  రూపిణి ఆదివారం నాడు  ఆత్మహత్య చేసుకొంది


హైదరాబాద్:ప్రేమించి పెళ్లి చేసుకొన్న రెండు మాసాలకే రూపిణి ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొంది. అత్తింటి వేదింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకొందని రూపిణి తండ్రి ఆరోపిస్తున్నాడు. 

ఏలూరుకు చెందిన సందీప్, రూపిణిలు హైద్రాబాద్‌లోని చిత్రాపురి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. సందీప్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. రూపిణి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.

వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకొంటున్నారు. దీంతో సందీప్ కుటుంబం గురించిన తెలిసిన రూపిణి కుటుంబసభ్యులు మాత్రం సందీప్‌తో పెళ్లిని వ్యతిరేకించారు. అయితే తల్లిదండ్రులు వ్యతిరేకించినా కూడ రూపిణి సందీప్‌ను పెళ్లి చేసుకొంటానని పట్టుబట్టింది.

దీంతో రూపిణి, సందీప్‌‌ల వివాహం 2018 మార్చిలో వివాహం జరిగింది. ఏప్రిల్ మాసంలో చిత్రాపురి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురాన్ని ఏర్పాటు చేశారు. అయితే పెళ్లైన రెండు మాసాల తర్వాత నుండి అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన రూపిణి తండ్రి ఆరోపించారు.

ఈ విషయమై రెండు రోజుల క్రితం కూతురు ఫోన్ చేస్తే వచ్చి తాను మాట్లాడి వెళ్లినట్టు చెప్పారు. తాను ఏలూరు వెళ్లకముందే అత్తింటి వేధింపులు పెరిగినట్టు ఫోన్ చేయడంతో తాను శనివారం రాత్రే హైద్రాబాద్‌కు చేరుకొన్నట్టుగా రూపిణి తండ్రి మురళి చెప్పాడు.

అత్త, మామ, భర్తతో మాట్లాడినట్టు చెప్పారు. తాను కూడ కొంత మేరకు నగదును కట్నంగా ఇస్తానని వారికి హామీ ఇచ్చాడు. అయితే తనకు కొంత సమయం కావాలని అడిగినట్టు చెప్పారు.

ఆదివారం నాడు ఉదయం తాను టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లగానే రూమ్‌లో తన కూతురు ఉరేసుకొని చనిపోయిందని అత్తింటివాళ్లు ఫోన్ చేసి చెప్పారని రూపిణి తండ్రి చెప్పాడు.

రూఫిణి ఆత్మహత్య చేసుకోవడానికి భర్త, అత్త,మామలే కారణమన్నారు. అయితే రూపిణి ఆత్మహత్య చేసుకొన్న తర్వాత అత్త లలిత, మామ ఇంటి నుండి పారిపోయారు. భర్త సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.