Asianet News TeluguAsianet News Telugu

ఇంటి మహిళా యజమానిని హత్య చేసిన టెక్కీ: బంగారు గాజుల చోరీ, విక్రయం

సికింద్రాబాదులోని ఆల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ టెక్కీ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఇంటి మహిళా యజమానిని చంపేసి, ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు దొంగిలించి వాటిని విక్రయించాడు.

Software engineer kills house owner, steals gold bangles in Hyderabad
Author
Alwal, First Published Jun 25, 2021, 8:36 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఇంటి మహిళా యజమానిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు దొంగిలించుకుని పారీపోయాడు. ఈ సంఘటన ఆల్వాల్ లోని కనాజీగుడాలో బుధవారంనాడు చోటు చేసుకుంది.

కిరాయికి ఉంటున్న టెక్కీ ఇంట్లోని బాత్రూంలో ఆ మహిళ శవం పడి ఉంది. ఆమె గాజులను టెక్కీ అమ్మెశాడు. భర్త చనిపోయిన 75 ఏళ్ల మహిళ మంగతాయారు తన మూడంతస్థులో భవనంలోని మొదటి అంతస్థులో ఒంటరిగా ఉంటోంది. భవనంలో ఇతర పోర్షన్లలో వేరేవాళ్లు అద్దెకు ఉంటున్నారు. 

మంగతాయారు కూతురు సమీపంలోనే నివాసం ఉంటోంది. ఇద్దరు కుమారుల్లో ఒకతను ఢిల్లీలో, మరొకతను అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. మంగతాయారు ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆల్వాల్ కానిస్టేబుల్ మంగతాయారు ఇంటికి వెళ్లాడు. 

మంగతాయారు ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది. బలవంతంగా తలుపులు తెరిచాడు. ఆమె ఫ్లాట్ లో కనిపించలేదు. అద్దెకు ఉంటున్నవారి ఫ్లాట్స్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాజేష్ అనే టెక్కీ ఉంటున్న ఫ్లాట్ లో మంగతాయారు శవం కనిపించింది. తన ఫ్లాట్ లో ఆమె శవం ఎందుకు ఉందో తనకు తెలియదని రాజేష్ పోలీసుల వద్ద బుకాయించాడు. 

అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో రాజేష్ తన నేరాన్ని అంగీకరించాడు. కేబుల్ వైర్ తో ఉరివేసి ఆమెను చంపి, ఆమె వద్ద నాలుగు బంగారు గాజులు తీసుకున్నట్లు అతను చెప్పాడు. రాజేశ్ భార్య వారం రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. అతను మంగతాయారును తన ఇంట్లోకి పిలిచి చంపేశాడు. గాజులను మేడ్చెల్ లో విక్రయించినట్లు రాజేశ్ చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios