మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగరి సమీపంలోని తుక్కుపూర్ ప్రాంతానికి చెందిన నర్సింహ(28) ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అతను 2012 నుంచి వనస్థలీపురంలోని ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నాడు. కాగా.. కొద్ది రోజుల క్రితమే నర్సింహకు ఉప్పల్ కి చెందిన ఓ యువతితో వివాహం కుదిరింది. ఆదివారం వారిద్దిరికీ కుటుంబసభ్యులు ఎంగేజ్ మెంట్ నిశ్చయించారు.  మరికాసేపట్లో శుభకార్యం నిమిత్తం యువతి ఇంటికి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే నర్సింహ తన గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.