Gadwal Bidda: సోషల్ మీడియా ఫేమ్ గద్వాల్ బిడ్డ మృతి.. అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది తమ ట్యాలెంట్‌ను బయటపెట్టడానికి అవకాశం లభించింది. మరికొందరు మాత్రం అనుకోకుండా ఫేమస్ అయిపోతుంటారు. అలా ఫేమస్ అయినవారిలో ‘గద్వాల బిడ్డ’ (Gadwal Bidda) గా పేరు పొందిన మల్లికార్జున్ రెడ్డి ఒకరు.
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది తమ ట్యాలెంట్‌ను బయటపెట్టడానికి అవకాశం లభించింది. మరికొందరు మాత్రం అనుకోకుండా ఫేమస్ అయిపోతుంటారు. నెట్టింట్లో నిత్యం చాలా వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అయితే కొన్ని మాత్రమే జనాలను ఆకర్షిస్తాయి. అవి తెగ వైరల్ అవుతాయి. అందులోని వారు ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయిపోతుంటారు. అలా ఫేమస్ అయినవారిలో ‘గద్వాల బిడ్డ’ (Gadwal Bidda) గా పేరు పొందిన మల్లికార్జున్ రెడ్డి ఒకరు. అయితే ఆ చిన్నారి మరణించాడనే వార్త చాలా మందిని షాక్‌కు గురిచేసింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలవురు నెటిజన్లు పోస్టులు కూడా చేస్తున్నారు.
ఇక, మల్లికార్జున్ రెడ్డి ఆదివారం మృతిచెందాడు. అతను అనారోగ్యంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అతని స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె. అతని అంత్యక్రియలు సోమవారం జిల్లేడుదిన్నెలో జరుగుతాయని కటుంబసభ్యులు తెలిపారు.
మల్లికార్జున్ రెడ్డి ఓ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. బూతులు తిడుతూ అతడు ఈ వీడియో చేశాడు. ఆపై దళితులను కించపరిచేలా వ్యవహరించాడంటూ దళిత సంఘాలు ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో అతడి చేత పోలీసుల సమక్షంలో క్షమాపణలు చెప్పించాడు. అప్పుడు ఆ పిల్లాడు తెగ ఏడ్చేశాడు. అయితే ఇలా ఫేమస్ అయిన మల్లికార్జున రెడ్డి.. ఆ తర్వాత మిమ్స్‌లో ఎక్కువగా కనిపించేవాడు. మీమ్స్ క్రియేట్ చేసేవాళ్లు.. అతడి ఎక్స్‌ప్రెషన్స్‌ను తెగ వాడేశారు. అలా మల్లికార్జునరెడ్డి ఎప్పుడూ నెట్టింట్‌లో కనిపించేవాడు.
తాజాగా మలికార్జురెడ్డి మరణించాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. పలువురు నెటిజన్లు అతడి మృతికి సంతాపం తెలుపుతున్నారు.#RIPGadwalBidda అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతడి డైలాగులతో క్రియేటివ్ వీడియోలు, మీమ్స్ చేసే పేజీలు మల్లికార్జున్‌కు నివాళి అర్పిస్తున్నాయి.