తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయాణించే హెలిక్యాప్టర్ లో పొగలు వచ్చాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది టెన్షన్ పడ్డారు. వెంటనే అలర్ట్ అయ్యారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాలిలా ఉన్నాయి.

కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ఉన్న ఒక బ్యాగ్ నుంచి పొగలు వచ్చాయి. హెలికాప్టర్ పైకి లేచే సమయం లో పొగలు రావడంతో సెక్యూరిటీ అప్రమత్తం అయ్యారు. పొగలు చిమ్మే బ్యాగును హెలిక్యాప్టర్ కు 100 మీటర్ల దూరంలో పరుగున వెళ్లి సిబ్బంది పారేశారు. హెలిక్యాప్టర్ లోని వైర్ లెస్ సెట్ అమర్చిన బ్యాగులో షాట్ సర్క్యూట్ తో మంటలు లేచాయంటున్నారు పోలీసులు.

పొగలు చిమ్మే బ్యాగును దూరంగా పడేసిన తర్వాత హెలిక్యాప్టర్ అక్కడినుంచి ఎగిరిపోయింది. ఆ వీడియోను కింద చూడొచ్చు.