మరో రైలు ప్రమాదం : హైదరాబాద్ - హౌరా ఎక్స్ప్రెస్ లో పొగలు..
మరో రైలు ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతో హైదరాబాద్ - హౌరా ఎక్స్ప్రెస్ లో పొగలు వ్యాపించాయి.

నెక్కొండ : హైదరాబాద్ - హౌరా ఎక్స్ప్రెస్ లో ఉన్నట్టుండి పొగలు వ్యాపించడంతో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి హౌరా వెడుతున్న రైలులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ నెక్కొండ దగ్గర రైలు ఆపేశారు. పొగలు గమనించిన ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలులో నుంచి కిందికి దూకి పరుగులు తీశారు. అయితే, బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతోనే పొగలు వచ్చినట్లుగా గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.