ఓ ఎద్దు సరాసరి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైపు దూసుకురావడంతో ఆయనకు కూడా గాయాలయ్యాయి.

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆయన నల్లగొండ జిల్లాలోని నక్కగూడెంలో నిర్వహించే ఎడ్ల పందేల ప్రదర్శనకు హాజరయ్యారు.

ఏటా ఇక్కడ శ్రీరామనవమినాడు ఎడ్ల పందేలు నిర్వహించడం ఆనవాయితీ. పందెనాకి వచ్చిన ఎడ్లు అక్కడున్న ప్రజల అరుపులకు బెదిరి పరుగులు తీశాయి.

దీంతో ఆ ప్రదేశంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఓ ఎద్దు సరాసరి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైపు దూసుకురావడంతో ఆయనకు కూడా గాయాలయ్యాయి.