Asianet News TeluguAsianet News Telugu

తప్పతాగి యువకుల వీరంగం: చిక్కుల్లో రంగారెడ్డి కొడుకు

అటవీ ప్రాంతంలో మద్యం తాగొన్నందుకు గాను  అటవీ సెక్షన్ ఆఫీసర్ జ్యోతి స్వరూప్‌పై ఆరుగురు  తీవ్రంగా దాడి చేశారు.  కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పించుకొన్నారు

Six persons attacked on forest officer jyoti swaroop at sunnipenta
Author
Sunnipenta APSRTC Bus Stand, First Published Aug 15, 2018, 1:51 PM IST


అచ్చంపేట: అటవీ ప్రాంతంలో మద్యం తాగొన్నందుకు గాను  అటవీ సెక్షన్ ఆఫీసర్ జ్యోతి స్వరూప్‌పై ఆరుగురు  తీవ్రంగా దాడి చేశారు.  కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పించుకొన్నారు. తాము మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కొడుకు అనుచరులమంటూ  ఫారెస్ట్‌ అధికారిపై  దాడికి పాల్పడ్డారు.  నిందితుల్లో ఆరుగురిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఘటన మహాబూబ్ నగర్ జిల్లా సున్నిపెంట‌లో చోటు చేసుకొంది.

మహాబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని సున్నిపెంట చెక్ పోస్టు సమీపంలో మంగళవారం రాత్రి పూట హైద్రాబాద్‌కు చెందిన ఆరుగురు యువకులు రెండు కార్లలో వచ్చారు.

మద్యం తాగుతూ  హంగామా సృష్టించారు. మద్యం తాగొద్దన్నందుకు గాను  ఈ ఎనిమిది మంది యువకులు  ఫారెస్ట్ సెక్షన్ ఆపీసర్ జ్యోతి స్వరూప్‌పై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.  అంతేకాదు  కాళ్లు పట్టుకొని  క్షమాపణ చెప్పించుకొన్నారు.

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ జ్యోతి స్వరూప్‌ను అటవీశాఖ కార్యాలయం  ఆవరణలోనే దాడికి దిగారు.  తాను ఎమ్మెల్సీ రంగారెడ్డి కొడుకు అనుచరులమని  ఓ యువకుడు తీవ్రంగా కొట్టాడు.  ఈ విషయమై  జ్యోతి స్వరూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా  ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  శ్రీశైలం వెళ్తున్న సమయంలోనే  ఈ నిందితులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పై దాడికి పాల్పడ్డారు. అటవీ శాఖాధికారిని గుర్తింపు కార్డు చూపాలంటూ  దాడికి దిగారు. విచక్షణరహితంగా కొట్టారు. అటవీశాఖ కార్యాలయంలోకి వెళ్లిన  జ్యోతి స్వరూప్‌పై దాడికి దిగారు.

Six persons attacked on forest officer jyoti swaroop at sunnipenta

నేనే పోలీస్ స్టేషన్ కు వచ్చాక నేను ఎవరో తెలుస్తోందని ఓ యువకుడు  రెచ్చిపోయాడు.  ఈ నిందితులు వచ్చిన కారు  నెంబర్ ఏపీ 28 జె 6661. ఈ కారు హైద్రాబాద్‌కు చెందిన అనిల్ కుమార్ గౌడ్ పేరుపై  రిజిస్ట్రేషన్ అయింది.  అంతేకాదు కాళ్లు మొక్కించుకొన్నాడు.

ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి ప్రకటించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios