సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ వైద్య కళాశాలలో (Government Medical College) ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకం రేపిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్‌గా స్పందించింది. 

సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ వైద్య కళాశాలలో (Government Medical College) ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకం రేపిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్‌గా స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎంఈ రమేష్‌రెడ్డి వేగంగా చర్యలు చేపట్టారు. ర్యాగింగ్ ఘటనకు సంబంధించి ఆరుగురు వైద్య విద్యార్థులను డీఎంఈ సస్పెండ్ చేశారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఏడాది పాటు సస్పెన్షన్‌ చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆరుగురిని హాస్టల్ నుంచి శాశ్వతంగా పంపించేస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. 

సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది. కాలేజ్ హాస్టల్‌లో ఫస్ట్ ఇయర్ చదువతున్న విద్యార్థి‌ని దాదాపు 25 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. దుస్తులు విప్పించి సెల్‌ఫోన్‌లో వీడియో తీయటంతో పాటు దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి ఆరోపించారు. కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని, విచారణకు ఆదేశించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. 

ఈ ఘటనపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ (Harish Rao) స్పందించారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో ragging విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ రోజు ఉదయమే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిపారు. కమిటీని ఏర్పాటు చేశామని.. ఈ రోజు మధ్యాహ్నం లోపు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్టుగా చెప్పారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

Also Read: సూర్యాపేట మెడికల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం..

ఈ క్రమంలోనే అధికారులు వేగంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వైద్య విద్యార్థులపై సూర్యాపేటల పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. సెకండ్ ఇయర్ వైద్య విద్యార్థులు శ్రవణ్, చాణిక్య, సోహెబ్, ఇన్‌సాఫ్ ఖాణ్, షాహబాజ్‌పై ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు తెలంగాణ ప్రోహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా సూర్యాపేట ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు. మరికొంత మంది విద్యార్థులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలిపారు.