హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేట్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. కారు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. మృతులు తాడ్ బండ్ కు చెందినవారుగా తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. గూడూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్, ట్రాక్టర్ పరస్పరం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది.