టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న సిట్ ఎదుట హాజరవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న సిట్ ఎదుట హాజరవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. పేపర్ లీక్ కేసుపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాల్సిందిగా కోరింది. కాసేపట్లో బండి సంజయ్ నివాసానికి చేరుకుని ఆయనకు నోటీసులు అందజేయనున్నారు అధికారులు. ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. సంజయ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అతికించారు సిట్ అధికారులు.
ఇదిలావుండగా.. టీఎస్‌సీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డికి తిరుపతికి మంది సంబంధాలున్నాయన్నారు. వీరిద్దరూ కూడా పక్క పక్క గ్రామాలకు చెందినవారేనని ఆయన చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు రాసిన వారిలో తిరుపతి, రాజశేఖర్ రెడ్డి మండలానికి చెందిన అభ్యర్ధులకు మంచి మార్కులు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ కార్యాలయం చక్కబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
అయితే టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం కేసులో రేవంత్ రెడ్డి చేసిన విమర్శల నేపథ్యంలో సిట్ అధికారులు సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ పీఏ తిరుపతి, ఈ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డికి చెందిన మండలంలో గ్రూప్-1 పరీక్షల్లో వెయ్యి మంది ఉత్తీర్ణులయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై తమకు సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డిని సిట్ అధికారులు కోరారు. పేపర్ లీక్ విషయమై విమర్శలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.
