Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు:ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టులో సిట్ రివిజన్ పిటిషన్

టీఆర్ఎస్  ప్రలోభాల కేసులో  ఏసీబీ కోర్టులో  సిట్ దాఖలు చేసిన మెమోపై  హైకోర్టులో సిట్  రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది.

SIT Files  Revision petition In Telangana high Court
Author
First Published Dec 7, 2022, 11:36 AM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో  తెలంగాణ హైకోర్టులో సిట్  బుధవారంనాడు రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది.ఇవాళ మధ్యాహ్నం విచారణ నిర్వహించనున్నట్టుగా  హైకోర్టు తెలిపింది. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  అడ్వకేట్ శ్రీనివాస్, బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్,  తుషార్, జగ్గుస్వామిలను నిందితులుగా చేర్చుతూ  మొయినాబాద్ పోలీసులు  ఏసీబీ కోర్టులో మెమోను దాఖలు చేశారు.ఈ విషయమై విచారణ  ఏసీబీ కోర్టు నిన్న విచారణ నిర్వహించింది. మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన  మెమోను కొట్టివేసింది. 

ఈ కేసులో  కొందరికి నోటీసులు జారీ చేసిన తర్వాత  ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు గాను ఏసీబీ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారని వారి తరపు న్యాయవాదులు కోర్టుల్లో వాదనల సమయంలో గుర్తు చేశారు. అన్నింటిని పరిగణనలోకి తీసుకున్న  ఏసీబీ కోర్టు ఈ మెమోను కొట్టివేసింది. దీంతో తెలంగాణ హైకోర్టులో  రివిజన్ పిటిషన్ ను  సిట్ దాఖలు చేసింది.

ఈ కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, అడ్వకేట్ శ్రీనివాస్ లను ఈ ఏడాది నవంబర్  21న  విచారణ నిర్వహించాలని సిట్  నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు మాత్రం అడ్వకేట్ శ్రీనివాస్ మినహా  ఇతరులెవరూ విచారణకు రాలేదు.  శ్రీనివాస్ ను రెండు రోజుల పాటు విచారించింది సిట్.  ఈ కేసులో సిట్ నోటీసులు అందుకున్న బీఎల్ సంతోష్, తుషార్,  జగ్గుస్వామిలు సిట్ నోటీసులను హైకోర్టులో సవాల్  చేశారు. బీఎల్ సంతోష్ , జగ్గుస్వామిలకు సిట్  ఇచ్చిన  నోటీసులపై  ఈ నెల 13వ తేదీ వరకు హైకోర్టు స్టే ఇచ్చింది.

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: చంచల్‌గూడ జైలు నుండి సింహయాజీ విడుదల

ఈ కేసు విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది  తెలంగాణ ప్రభుత్వం. అయితే సిట్  విచారణను బీజేపీ  వ్యతిరేకిస్తుంది.  సీఎం కనుసన్నల్లోనే  సిట్  విచారణ కొనసాగుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే  ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని  బీజేపీ కోరుతుంది.ఇదే విషయమై బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  బీజేపీ పిటిషన్ తో పాటు  మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు విచారణ నిర్వహిస్తుంది.  ఇవాళ కూడా ఈ పిటిషన్ పై విచారణ సాగుతుంది. 

ఈ ఏడాది అక్టోబర్  26న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. ఈ కేసులో  అదే రోజున  ఈ ముగ్గురిని  అరెస్ట్ చేశారు.  అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,  కొల్లాపూర్ ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్  రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారని  కేసు నమోదైంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios