Asianet News TeluguAsianet News Telugu

రాహుల్‌తో ముగిసిన గద్దర్ భేటీ.. సాయంత్రం 4.30కి సోనియాతో సమావేశం

ప్రజా గాయకుడు గద్దర్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు.. తెలంగాణ ఎన్నికలు, మహాకూటమి తరపున ప్రచారం తదితర అంశాలపై ఆయన రాహుల్‌లో చర్చించారు. 

singer Gaddar comments against his joining in congress party
Author
Delhi, First Published Oct 12, 2018, 2:13 PM IST

ప్రజా గాయకుడు గద్దర్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు.. తెలంగాణ ఎన్నికలు, మహాకూటమి తరపున ప్రచారం తదితర అంశాలపై ఆయన రాహుల్‌లో చర్చించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో చేరలేదని.. ఏ పార్టీలోనూ సభ్యుడిని కాదన్నారు.. అయితే రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. గజ్వేల్‌లో కేసీఆర్‌పై బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు.

ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా తాను పోటీ చేస్తానని గద్దర్ అన్నారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తానని ఆయన వెల్లడించారు. మరోవైపు సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేత, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని గద్దర్ కుటుంబసభ్యులు కలవనున్నారు.

కాగా, గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని.. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పొటీ చేయబోతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకే ఇవాళ రాహుల్ గాంధీని కలవబోతున్నారని ప్రచారం జరిగింది. 

కాంగ్రెస్‌లోకి గద్దర్.. గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ..?

Follow Us:
Download App:
  • android
  • ios