ఇంతకీ సింగరేణి ఉద్యోగుల పొట్టకొట్టిందెవరు..? 

పరీక్షల నిర్వహణలోనూ, నియాకాల భర్తీలోనూ టీఆర్ఎస్ సర్కారు ప్రతీసారి ఫెయిల్ అవుతూనే ఉంది.

తాజాగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంపై సింగరేణి కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. హైకోర్టు తీర్పు వారిని తీవ్ర నిరాశకు గురిచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దీంతో వెంటనే సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని కార్మికులను సంతృప్తి పరిచే పనిలో పడింది.

పనిలో పనిగా ఈ జీవోను కోర్టు కొట్టేయడానికి టీ జాక్ నేతలు, కాంగ్రెస్ పార్టీ కారణమనే కలరింగ్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది.

ఇందులో భాగంగానే కొందరు టీఆర్ఎస్ మద్దతుదారులు, సింగరేణిలోని కొందరు కార్మికులను ఉసిగొల్పి టీ జాక్ చైర్మన్ కోదండరాంపై బురదజల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కొందరు గులాబీనేతలు, సింగరేణి కార్మికులు కోదండరాం దిష్టి బొమ్మను తగలబెట్టారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా కోదండరాం, కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే వారసత్వ ఉద్యోగాల జీవోను సవాలు చేస్తూ కోర్టులు కేసు వేసింది సతీష్ కుమార్ అనే వ్యక్తి. ఆయనకు టీఆర్ఎస్ లోని కొందరు నేతలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.